- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'పుష్ప' రాజ్ వచ్చేస్తున్నాడు…
దిశ, వెబ్ డెస్క్: ‘పుష్ప’ రాజ్ వచ్చేస్తున్నాడు. ఎర్ర చందనం అడవుల్లో ఊర మాస్ గెటప్‌లో పరిగెత్తుకుంటూ వస్తున్నస్మగ్లర్ పుష్పరాజ్ పరిచయం త్వరలోనే కానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహిద్ పాజిల్ ప్రతినాయకుడిగా మెరవబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్‌లో బన్నీ ఊర మాస్ గెటప్‌లో ఫాన్స్‌కి పూనకాలు తెప్పించాడు.
ఇక తాజాగా ఏప్రిల్ 8 బన్నీ బర్త్ డే సందర్భంగా ‘పుష్ప’ విజువల్ పరిచయం ఉన్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒక మాస్ అప్ డేట్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. చేతులకు కట్లతో.. ముఖానికి మాస్క్ తో అడవిలో పరిగెడుతున్న బన్నీ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌ను విజువల్‌గా పరిచయం చేయనున్నట్లు తెలిపింది. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ‘పుష్ప’ ఆగస్టు 13న విడుదల కానుంది.