- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప సినిమా ఎందుకు చూడాలంటే ?
దిశ, వెబ్‌డెస్క్ : తగ్గేదే లేదంటూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. సుకుమార్ దర్శకత్వంలో బన్నీది మూడో సినిమా కావడం, ఇందులో స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేస్తుడటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కూడ ఓ రేంజ్ లో చేశారు బన్నీ, సుకుమార్.
ఇక ఈ సినిమాను ఎందుకు చూడాలి అనే అనుమానం కొందరిలో కలుగుతూ ఉంటుంది. బన్నీ కెరియర్‌లోనే పాన్ ఇండియా సినిమాగా తొలి సారిగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతోంది పుష్ప. ఎప్పుడు డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకురావడం బన్నీ స్టైల్. కానీ ఈ సారి మరీ కొత్తగా పుష్పసినిమాలో కనిపించనున్నాడు. ఇందుకోసం బన్నీ చిత్తూరు యాస నేర్చుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ‘పుష్ప’అత్యధిక భాగం అడవుల్లో చిత్రీకరించారు. అందుకోసం చిత్ర బృందం మారేడుమిల్లి అడవులను ఎంచుకొని అక్కడ ఎంతో అందంగా సినిమాను చిత్రీకరించారు. యూనిట్ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లడానికి రోజూ దాదాపు 300 వాహనాలను ఉపయోగించేవారు. అలాగే ఇందులో కమెడీయన్ అయిన సునీల్, యాంకర్ అనసూయ ఢిపరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. సినిమాతో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, కన్నడ నటుడు ధనుంజయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కలసి తీసే సినిమా అంటే కుర్రకారుకు ఓహో అనిపిస్తోంది. అందువలన చిత్తూరు యాసలో బన్నీ ఏమేరకు తన పాత్రకు న్యాయం చేశారు. అసలు మారేడుమిల్లి అడవుల్లో ఏం జరిగింది ? దాక్షాయణిగా అనసూయ రాణించగలిగిందా ? నవ్వులు పూయించే నవ్వుల రాజు సునీల్ భయపెట్టాడా అని తెలియాలంటే తప్పని సరి పుష్ప సినిమా చూడాలంటున్నారు కొందరు.
- Tags
- allu arjun