- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ జోరుకు పంజాబ్ బ్రేక్ వేసేనా?
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో వరుస విజయాలతో ఢిల్లీ జట్టు దూసుకెళ్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతోంది. అంతేగాకుండా ఇటు పంజాబ్ కూడా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రాకతో వరుసగా రెండు మ్యాచ్‌లు విజయం సాధించి, ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు పంజాబ్ గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
Next Story