ఒక్కో జర్నలిస్ట్ ఫ్యామిలీకి రూ. 10 లక్షలు

by Anukaran |
ఒక్కో జర్నలిస్ట్ ఫ్యామిలీకి రూ. 10 లక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా సోకి ప్రజలు మృత్యువాతపడుతున్నారు. పలువురు జర్నలిస్టులు కూడా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. జైదీప్ అనే యువ జర్నలిస్ట్ కరోనాతో ఆదివారం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అమరీందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story