- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుల్వామా కారు బాంబు వ్యూహకర్త ఫౌజీ భాయి హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ కమాండర్ అబ్దుర్ రెహ్మాన్ అలియాస్ ఫౌజీ భాయి సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామాలోని కాంగన్ గ్రామంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా, భారత సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో గత నెల 28న పుల్వామా తరహా దాడి చేయడానికి కుట్రపన్నిన సూత్రధారి, జైషే సంస్థ కమాండర్, బాంబు తయారు చేయడంలో నిపుణుడైన ఫౌజీ భాయి ఉన్నాడు. కాగా, ఫౌజీ మృతితో జైషే సంస్థకు కోలుకోలేని దెబ్బ పడిందని విజయ్ కుమార్ తెలిపారు. జైషే మహ్మద్ సంస్థలో బాంబు తయారు చేయడానికి ముగ్గురు నిపుణులుండగా, అందులో ఫౌజీ ఒకడని వెల్లడించారు. ప్రస్తుతం మరో ఇద్దరు మాత్రమే ఉన్నట్టు వివరించారు.