- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అద్భుతమైన పథకం.. రూ.200 ఆదాతో రూ. 14 లక్షలు మీ సొంతం
దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా డబ్బులు పెడితే మంచి రాబడి కోసం చూస్తారు. కొంత మంది ఎందులో డబ్బులు పెడితే రాబడి వస్తుందా అని ఆలోచించి మంచి బ్యాంకులో పెట్టుబడి పెడుతారు. అయితే అలాంటి వారి కోసమే ఈ పథకం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (పీపీఎఫ్) లో డబ్బులు పెట్టి మంచిగా రాబడి పొందొచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సులభంగా మంచి ఫండ్ తీసుకొచ్చు. మరీ ఇంకెందుకు ఆలస్యం ఈ పథకం గురించి తెలుసుకుందాం.. చిన్న పొదుపు పథకానికి ప్రత్యామ్నాయం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా. దీని ద్వారా రోజుకు కేవలం రూ. 200 ఆదా చేయడం ద్వారా 20 సంవత్సరాలలో 14 లక్షల రూపాయలు జమ చేసుకునే వీలుంది. చిన్న మొత్తాలతో పెద్ద మొత్తంలో మీరు లాభం పొందేదుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
పీపీఎఫ్ ప్రయోజనాలు..
-
పీపీఎఫ్ ద్వారా ఎలాంటి రిస్క్ ఉండదు.
-
ఈ పథకం కింద వచ్చిన వడ్డీపై ఆదాయపు పన్ను ఉండదు.
-
దీనికి నామినీ సౌకర్యం కూడా ఉంది.
-
ఈ ఖాతా పోస్టాఫీసులు, బ్యాంకుల ఎంచుకున్న శాఖలలో 15 సంవత్సరాలు తెరుచుకోవచ్చు, దీనిని 5 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.
పీపీఎఫ్ పథకంలో మీరు కనీసం 500 రూపాయలు పెట్టుబడి పెట్టడం అవసరం. సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే వడ్డీ రేట్లు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఈ పథకం కింద, రోజుకు 200 రూపాయలు ఆదా చేస్తే ఆ డబ్బు నెలకు 6000 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మీ వార్షిక పెట్టుబడి 72,000 రూపాయలు. మీరు ఇలా 15 సంవత్సరాలు చేస్తే, మీ మొత్తం పెట్టుబడి 10,80,000 రూపాయలు. ఒకవేళ మీరు 20 సంవత్సరాల పాటు ఒకే రేటుతో వడ్డీ వస్తే అప్పుడు రాబడి రూ .14.40 లక్షలు. అంటే, మీ మొత్తం పెట్టుబడిపై 17.55 లక్షల రూపాయల వడ్డీ రూపంలో అదనంగా వస్తుంది.