- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్న పబ్జీ?
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్‌లో పబ్జీ ఆడని కుర్రకారు లేదనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి పబ్జీ ఆటను భారతదేశంలో నిషేధించినపుడు ఎందరివో గుండెలు బద్దలయ్యాయి. అయినప్పటికీ బ్యాక్‌ట్రాక్‌లో ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుని ఆడుకున్నారు. తర్వాత ఆ అవకాశం కూడా లేకుండా పబ్జీ యాజమాన్యం టెన్సంట్ గేమ్స్ వారు మొత్తం భారతీయ సర్వర్‌లు ఆఫ్ చేసి, ఇక్కడ ఎవరూ పబ్జీ ఆడే వీలు లేకుండా చేశారు. పబ్జీ పూర్తిగా కనుమరుగై పోయి వారం రోజుల దాటిన తర్వాత వైరల్ అవుతున్న ఒక వార్త మళ్లీ కొత్త ఆశలను చిగురిస్తోంది. త్వరలో పబ్జీ రీఎంట్రీ ఇవ్వనుందనేది ఈ వైరల్ వార్త సారాంశం. దీని గురించి టెన్సంట్ గేమ్స్ వారు అధికారిక ప్రకటన చేయలేదు కానీ, ప్రముఖ టెక్ న్యూస్ వెబ్‌సైట్ టెక్ క్రంచ్ దీని గురించి ప్రస్తావించింది. పబ్జీ కార్పొరేషన్ వారు ప్రత్యేకంగా భారతీయ యూజర్ల కోసం భారతదేశంలోనే సర్వర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తునట్లు పేర్కొంది. అంటే పబ్జీ సర్వర్లు భారతదేశంలోనే ఉంటే, ఇక చైనా సర్వర్లతో సమస్య ఉండదు కాబట్టి భారతప్రభుత్వం ఇందుకు అనుమతించే అవకాశం ఉంటుందని, ఈ మేరకు భారత్‌లో పబ్జీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు టెక్ క్రంచ్ వెల్లడించింది.