- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జంట హత్య కేసులో పబ్జీ ప్లేయర్లు.. విచారణలో షాకింగ్ నిజాలు
దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల జంటహత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 18వ తేదీన పట్టణంలోని బృందావన్‌కాలనీలో విజయలక్ష్మి, ఆమె కూతురు రవీనా దారుణహత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడు కాలేరు అరుణ్ కుమార్(అల్లుడు), గుంటూరు జిల్లాకు చెందిన జుజ్జవరపు రోశయ్య అలియాస్ బిట్టు, కృష్ణా జిల్లాకు చెందిన దండం సుబ్బారావులు ఈ హత్య చేసినట్టు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.
విచారణలో షాకింగ్ నిజాలు..
రామగుండం సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నిత్యం పబ్జీ ఆడే కాలేరు అరుణ్‌కు అదే గేమ్‌లో రవీనా పరిచయం అయింది. వీరి పబ్జీ పరిచయంతో ఏకంగా ప్రేమ పెండ్లి చేసుకున్నారు. పెండ్లి అనంతరం జల్సాలకు అలవాటు పడ్డ అరుణ్ పని చేయడం మానేశాడు. పైగా బీటెక్ చేసిన భార్య ఇంట్లోనే ఉంటుందని.. ఉద్యోగం చేసి డబ్బులు తీసుకురావాలని వేధించసాగాడు. నిత్యం పబ్జీ గేమ్‌లోనే ఉంటూ.. డబ్బులివ్వండి అంటూ భార్య, అత్తతో గొడవలు పడేవాడు అరుణ్.
ఈ నేపథ్యంలోనే తన జల్సాలకు అడ్డుగా వస్తున్నారని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.. ఒకానోక సమయంలో యూ ట్యూబ్ చూస్తుండగా.. ‘Supari killer Vijayawada అనే IDతో We sell weapons and do murder and kidnaps అని ఒక international నెంబర్ పెట్టి whatsup me’ అని కామెంట్ పెట్టాడు గుంటూరుకు చెందిన జుజ్జవరపు రోశయ్య అలియాస్ బిట్టు. ఈ కామెంట్ చూసి అతడితో పరిచయం పెంచుకున్నాడు అరుణ్. ఆ తర్వాత తన భార్య, అత్తను హత్య చేయాలని పథకం వేశాడు. వీరికితోడుగా తెనాలికి చెందిన దండం సుబ్బారావు కూడా జతకట్టాడు. సుపారీగా అత్త ఇంట్లో ఉన్న బంగారం, నగదును పంచుకుందామని ఒప్పందం చేసుకున్నారు ఈ ముగ్గురు.
పథకం ప్రకారం జూన్ 17న మంచిర్యాలకు చేరుకున్నారు బిట్టు, సుబ్బారావు. అనంతరం అరుణ్‌ని కలిసి ఓకే లాడ్జీలో బీర్లు తాగి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కలిసి భార్య రవీనా, అత్త విజయలక్ష్మి ఉన్న నివాసానికి వెళ్లి వారిపై దాడి చేశారు. దారుణంగా కొట్టి హత్య చేశారని సీపీ సత్యనారాయణ వెల్లడించారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.