పబ్‌జీ ఆడండి.. రూ.5 లక్షలు గెలవండి!

by Shyam |   ( Updated:2020-08-24 07:00:33.0  )
పబ్‌జీ ఆడండి.. రూ.5 లక్షలు గెలవండి!
X

దిశ, వెబ్‌డెస్క్: పబ్‌‌జీ ఆటలో పడితే.. ఈ లోకాన్నే మరిచిపోతుంటారు. అయితే పబ్‌జీ ఆడేవాళ్లకు ప్రతిరోజు ఇంట్లో వాళ్లతో తిట్లు పడుతూనే ఉంటాయి. కానీ ఈ న్యూస్ వింటే మాత్రం పబ్‌జీ‌ ఆడేవాళ్లను.. ఇంట్లో వాళ్లు కూడా తప్పకుండా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే.. ఇప్పుడు పబ్‌జీ ఆడితే ప్రైజ్‌మనీ గెలిచే అవకాశముంది. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ చాంపియన్‌షిప్ ‘పబ్‌జీ మొబైల్ లైట్’ యూజర్లకు మాత్రమే. కాగా, ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన వాళ్లంతా.. దాదాపు రూ. 5 లక్షల వరకు గెలుపొందే చాన్స్ ఉంది. పబ్‌జీ మొబైల్ లైట్ – చాంపియన్‌షిప్ (ఇండియా 2020) అనే పేరుతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం కాగా, రిజిస్ట్రేషన్లకు ఆఖరి తేది ఆగస్టు 30.

క్వాలిఫైయర్స్: సెప్టెంబర్ 1 – 5 వరకు
ప్లే ఆఫ్స్: సెప్టెంబర్ 12- 15 వరకు
ఫైనల్స్: సెప్టెంబర్ 19- 20 వరకు

రిజిస్ట్రేషన్ చేసుకున్న టీమ్.. క్వాలిఫైయర్స్‌‌లో భాగంగా 10 క్లాసిక్ మోడ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. మొత్తంగా 8 మ్యాచ్‌ల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన 44 గ్రూపులను నెక్ట్స్ లెవెల్‌కు పంపిస్తారు. ఆన్‌లైన్ క్వాలిఫైయర్స్ 44 గ్రూపులతో, 16 ఇన్‌వైటెడ్ టీమ్స్ కలిపి మొత్తంగా 60 టీమ్‌లను 4 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ప్రతి గ్రూపు మొత్తంగా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి గ్రూపు నుంచి మూడు టీమ్‌లను తర్వాతి స్టేజ్‌కు సెలెక్ట్ చేస్తారు. పబ్‌జీ మొబైల్ లైట్ చాంపియన్‌షిప్ 2020 ఫైనల్‌కు 12 టీమ్స్ చేరకుంటాయి. 12 టీమ్స్‌తో పాటు మరో మూడు టీమ్స్ జట్టు కడతాయి. వీరంతా 10 మ్యాచ్‌లు ఆడతారు. హయ్యెస్ట్ స్కోర్ చేసిన టీమ్ విజేతగా నిలుస్తుంది.

విన్నర్ టీమ్ – రూ. 2 లక్షలు
రన్నరప్ – రూ. లక్ష
సెకండ్ రన్నరప్ – రూ. 60 వేలు

కన్సోలేషన్ ప్రైజెస్ :
4వ స్థానం – రూ. 40 వేలు
5వ స్థానం – రూ. 30 వేలు
6వ స్థానం – రూ. 20 వేలు
7వ స్థానం – రూ. 15 వేలు
8వ స్థానం – రూ. 10 వేలు

పీపుల్ చాయిస్ అవార్డు పొందిన టీమ్‌ రూ. 25 వేలు గెలుచుకుంటుంది.

Advertisement

Next Story