పబ్జీ మొబైల్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఈవెంట్!

by Harish |   ( Updated:2020-08-14 07:51:44.0  )
పబ్జీ మొబైల్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఈవెంట్!
X

74వ స్వాతంత్ర్య దినోత్సవం (74th Independence Day) సందర్భంగా పబ్జీ మొబైల్(PUBG MOBILE) గేమ్ భారతీయ అభిమానుల కోసం ఒక ప్రత్యేక ఈవెంట్‌ (Special event)ను ప్రారంభించింది. ఇన్‌క్రెడిబుల్ ఇండియా (Incredible India) పేరుతో ఆగస్టు 10వ తేదీన ఆవిష్కరించిన ఈ ఈవెంట్, 24 వరకు కొనసాగనుంది. ఈ ఈవెంట్‌లో భాగంగా ఇంట్లోనే ఉంటూ భారతదేశంలోని ప్రముఖ కట్టడాలు (Famous buildings, Historical) అన్నింటినీ పబ్జీ గేమ్‌లో చుట్టేయొచ్చు.

పబ్జీ (PUBG) నిర్వహించే ప్రతి ఈవెంట్‌లో కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. కానీ, ఈ ఈవెంట్‌లో చాలా నియమాలు ఉన్నాయి. పూర్తి చేసిన మిషన్‌లో ప్లేయర్లకు (PUBG PLAYERS) ఒక ఫ్లిప్ దొరుకుతుంది. భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలతో ఉన్న క్విజ్‌ (Quiz)లో పాల్గొనడం ద్వారా కూడా ఫ్లిప్‌ (Flip)లు సేకరించవచ్చు. రోజుకు మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం ద్వారా ఒక ఫ్లిప్ గెలుచుకోవచ్చు.

ఈ ఫ్లిప్‌లన్నింటినీ సేకరించిన తర్వాత హోమ్‌పేజీ (Home page)లో ఉన్న యాక్టివ్ లొకేషన్ (Active location) వద్ద వీటిని వినియోగించాలి. పబ్జీ మొబైల్ ఫ్లిప్ (PUBG MOBILE) Flip) ద్వారా మెమొరీ గేమ్(Memory game) గెల్చుకోవాలి. అందుకోసం ఏదైనా కార్డు మీద ట్యాప్ చేసి దాన్ని ఫ్లిప్ (Flip) చేయాలి. అప్పుడే దాని వెనక ఉన్న రివార్డు (Reward) గెలుచుకోవచ్చు. తర్వాత రెండో కార్డును ఫ్లిప్ చేయాలి.

మొదటి, రెండో కార్డుల మీద లొకేషన్ (Location) ఒకటే అయితే అది ఓపెన్ అవుతుంది. అలా ప్రతి లోకేషన్‌లో ఉన్న ఆరు కార్డులను గెలుచుకుని మూడు రివార్డు (Reward)లను సొంతం చేసుకోవచ్చు. కేవలం ఈ ఈవెంట్ మాత్రమే కాకుండా ప్రముఖ కట్టడాల వాల్‌పేపర్ల (Wallpapers)ను కూడా పబ్జీ అందిస్తోంది. వీటిలో దాల్ సరస్సు(Dal Lake), ఎర్ర‌కోట(Red Fort), తాజ్‌మహల్(Taj Mahal), విక్టోరియా మెమోరియల్ (Victoria Memorial), చార్మినర్(Carminar), చెన్నై సెంట్రల్ (Chennai Central), మైసూర్ ప్యాలెస్(Mysore Palace) వంటి ప్రముఖ నిర్మాణాల వాల్‌పేపర్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed