గేదె నిరసన.. పరుగులు పెట్టిన జనం

by Shamantha N |   ( Updated:2021-07-04 00:06:50.0  )
గేదె నిరసన.. పరుగులు పెట్టిన జనం
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఏడాదిన్నరగా పాఠశాలలు తెరుచుకోలేదు, కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గు ముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో స్కూల్స్ ఓపెన్ చేయాలని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరసనకు దిగాయి. కానీ ఈ నిరసన బెడిసి కొట్టి ఆందోళనకారులకు చుక్కలు చూపించింది. నిరసన చేస్తే చుక్కలు చూడటం ఏంటీ అనుకుంటున్నారా.. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టడానికి ఓ గేదెను తీసుకొచ్చారు. గేదెతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే అంతమంది జనాన్ని చూసిన గేదె తనని ఎమన్న చేస్తారా అని భయపడిందో ఏమో తెలియదు కానీ వారందరి హడావుడి చూసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దాంతో గెేదె జనం మీదికి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న జనం పరుగులు తీశారు. ఇక ఈ ప్రమాదంలో ఓ మహిళ గాయపడింది. ఇక ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.

Advertisement

Next Story