‘భారత సంపద కొల్లగొట్టేందుకే ట్రంప్ పర్యటన’

by Shyam |
‘భారత సంపద కొల్లగొట్టేందుకే ట్రంప్ పర్యటన’
X

దిశ, హైదరాబాద్: భారత సంపదను కొల్లగొట్టడానికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మన దేశంలో పర్యటనకు వచ్చారని సీపీఐ ఎం.ఎల్.న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రమ విమర్శించారు. ట్రంప్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, పాడి, కోళ్లు తదితర రంగాలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సూర్యాపేటలో నిర్వహించిన నిరసనలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడికి భారత ప్రధాని ఎర్రతివాచీ పరచడం దేశాన్ని తాకట్టు పెట్టడమేనని మండిపడ్డారు. అనంతరం ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసనాకార్యక్రమాల్లో సీపీఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఝాన్సీ, సూర్యం, హన్మేశ్, ఎస్.ఎల్ పద్మ, ప్రదీప్‌లు సహా పీడీఎస్‌యూ, పీవైఎల్, ఐఎఫ్‌టీయూ, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read also..

జనగణన సమర్ధవంతంగా నిర్వహించాలి : కలెక్టర్

Advertisement

Next Story

Most Viewed