వ్యభిచార ముఠా గుట్టురట్టు.. మైనర్‌కు విముక్తి

by Sumithra |
Prostitution gang
X

దిశ, జల్‌పల్లి: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, గుట్టుచప్పడు కాకుండా మైనర్‌తో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును బాలాపూర్ పోలీసులు రట్టు చేశారు. బాలాపూర్ రాయల్​కాలనీలో వ్యభిచార గృహంపై బాలాపూర్​పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార కూపం నుంచి మైనర్(17) కు విముక్తి కలిగించారు. వ్యభిచార ముఠాలోని ముగ్గురు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకుని బాలాపూర్​పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2420 నగదుతో పాటు మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్ ఇన్‌స్పెక్టర్​భాస్కర్ వివరాల ప్రకారం.. బాలాపూర్​రాయల్​కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్​అబూబాకర్లు భార్యాభర్తలు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో రెహానా బేగం, సయ్యద్​అబూబాకర్లు తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేస్తామని నిర్ణయించుకున్నారు.

రెండు నెలల క్రితం చాంద్రాయణగుట్ట నుంచి రాయల్ కాలనీకి రెహానా బేగం మకాం మార్చారు. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో పక్కింటికి చెందిన మైనర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపింది. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.2 వేలు రెహానాబేగం వసులు చేస్తుండగా అందులో సగం డబ్బులు వెయ్యి మాత్రమే బాలికకు ఇవ్వసాగింది. విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్​పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెహానా బేగం, సయ్యద్​అబూబాకర్, సల్మాబేగం, విటుడు మహ్మద్ అష్యు‌లను బాలాపూర్​పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed