- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ వల్లే ఇండియాలో నష్టాలు : అమెజాన్!
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ మార్చితో ముగిసిన త్రైమాసికంలో 29 శాతం క్షీణత నమోదైనట్టు వెల్లడించింది. 2019-20 త్రైమాసికంలో సుమారు 2.54 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించినట్టు ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది సుమారు 3.56 బిలియన్ డాలర్లుగా ఉండేదని సంస్థ పేర్కొంది. స్థూల ఆదాయం 26 శాతం పెరిగి 75.5 బిలియన్ డాలర్లకు చేరిందని, ఈ విభాగంలో 73.7 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్టు సంస్థ తెలిపింది. లాక్‌డౌన్ వల్లే తమ సంస్థ లాభాలు తగ్గినట్టు కంపెనీ తెలిపింది. ఇంతకుముందు కంటే ఆర్డర్లు పెరిగినప్పటికీ కరోనాను నిలువరించేందుకు విధించిన ఆంక్షల వల్ల వినియోగదారులకు చేరువ కావడం ఖర్చుతో కూడిన పనిగా మారిందని వివరించింది. ఈ కారణంగానే సంస్థ లాభాల్లో తగ్గుదల ఉన్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. రానున్న రెండో త్రైమాసికంలో వినియోగదారులకు మరింత వేగంగా వస్తువులను చేర్చడానికి తగిన చర్యలు తీసుకుంటామని అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ పేర్కొన్నారు.
ఇండియాలో..
ఇండియాలో ఐదేళ్ల కాలంలో ఈ త్రైమాసికంలోనే తమ సంస్థకు నష్టాలొచ్చాయని, దేశంలో నిత్యావసరలకు మాత్రమే డెలివరీకి అనుమతులుండటం వల్ల నష్టాలు తప్పలేదని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ తెలిపారు. అలాగే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు, మాస్కులతో పాటు ఇతర రక్షణావసరమైన వాటిని అందిస్తామని ప్రకటించారు. వీటికోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసికంలో సుమారు రూ. 30 వేల కోట్లను వెచ్చిస్తామని జెఫ్ బెజోస్ వెల్లడించారు.
Tags : Amazon, Pandemic, Profit, Sales