ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ దీక్షను విరమింపజేయాలి

by Shyam |   ( Updated:2020-10-20 02:26:49.0  )
ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ దీక్షను విరమింపజేయాలి
X

దిశ, వెబ్‎డెస్క్ : నాగ్‎పూర్ సెంట్రల్ జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఈ నెల 21న చేపట్టబోయే “ఆమరణ నిరహార దీక్ష”ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమింపజేయాలని వరంగల్ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం ఉదయం హన్మకొండలో డిస్ట్రిక్ట్ డిసేబుల్డ్ వెల్ఫేర్ కార్యాలయం ఎదుట దివ్యాంగుల జాక్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జాక్ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ.. 90 శాతం అంగవైకల్యంతో సహా తీవ్ర అనారోగ్య సమస్యలతో దుర్భర జీవనం అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా పట్ల జైలు అధికార్ల అప్రజాస్వామిక వైఖరి గర్హనీయమే కాకుండా వారి అమానవీయవైఖరికి నిదర్శనమన్నారు. జైల్ మాన్యువల్‎కు విరుద్ధంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన మందులు, పుస్తకాలు, లేఖలు కూడా ఆయనకు చేరనివ్వడం లేదని ఆరోపించారు. తనకు సరైన వైద్యం అందించడం లేదని తీవ్ర మనోవేదన చెందిన సాయిబాబా అంతిమ అస్త్రంగా ఆమరణ నిరహార దీక్షకు పిలుపునివ్వడం కుటుంబ సభ్యులు, ప్రజాస్వామిక వాదులను ఆందోళనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని అతని ఆరోగ్యరీత్యా సాయిబాబా చేపట్టిన దీక్షను విరమింపజేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story