‘తుంబాద్’ సీక్వెల్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ.. యూనిక్ థాట్ రెడీ!

by Jakkula Samataha |
‘తుంబాద్’ సీక్వెల్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ.. యూనిక్ థాట్ రెడీ!
X

దిశ, సినిమా : 2018లో వచ్చిన మైథలాజికల్ బాలీవుడ్ హారర్ ఫిల్మ్ ‘తుంబాద్’. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత సోహమ్ షా అండ్ టీమ్ ఆరేళ్ల పాటు తెరకెక్కించగా, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించిన షా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు.

‘తుంబాద్’కు సీక్వెల్ ఉంటుంది కానీ కేవలం డబ్బు, ప్రచారం కోసం మాత్రమే సినిమా తీయబోమని పేర్కొన్నాడు. మూవీ యూనిట్ కథలో సరైన పాయింట్ కోసం ప్రయత్నిస్తోందని వివరించాడు. మహారాష్ట్రలోని తుంబాద్ గ్రామంలో దాగున్న గుప్త నిధి కోసం సాగే అన్వేషణ‌తో ‘తుంబాద్’ తెరకెక్కగా, దాని కంటే ఇంట్రెస్టింగ్ థాట్‌తో కథపై స్పష్టత వచ్చాకే సీక్వెల్ ప్రారంభిస్తామని సోహమ్ షా తెలిపారు.

Advertisement

Next Story