- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజామాబాద్ రైతన్నలకు కొత్త కష్టాలు!
దిశ, నిజామాబాద్: యాసంగి పంటలు కోతలకు వచ్చిన వేళ రైతన్నలకు కోతల కష్టాలు వచ్చాయి. లాక్ డౌన్ కారణంగా కూలీలు దొరక్క పంటలు చేతికి వచ్చిన వేళ రైతులకు కొత్త దిగులు పట్టుకుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోద్దామంటే యంత్రాలు దొరక్కా.. దొరికినా కూడా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకాలు వేసే హమాలీలు దొరకడం లేదు. ఓ వైపు యంత్రాల కొరత, హమాలీల కొరతతో వరి పంట పండిన ఆనందం కంటే ఎక్కడ ఆకాల వర్షాలకు చేతికి వచ్చిన పంటను నష్టపోవాల్సి వస్తదో అని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో ఇది యాసంగి(రబీ) పంటల కోతల కాలం. వరి పంట చేతికొచ్చిన వేళ కోతలకు కూలీలు దొరక్క రైతులలకు తిప్పలు తప్పడం లేదు.
తెలంగాణలో చాలామందికి అధారం, ఆదాయం వనరు వ్యవసాయమే. ప్రతి గ్రామంలో రైతు కుటుంబాలు మినహా, కొందరు మాత్రమే ముఖ్యంగా మహిళలు వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటారు. ఉపాధి హమీ పథకం ప్రారంభమైన తరువాత వ్యవసాయానికి కూలీలు దొరకడమే కష్టంగా మారింది. చిన్న, సన్నకారు రైతులు గ్రామాలలో దొరికిన వారి చేతనే తమ పంటలను కోసి ధాన్యాన్ని ఇండ్లకు తరలించుకుంటారు. పెద్ధ కమతాలు, మోతుబరి రైతులు మాత్రం యంత్రాల ద్వారా పంట నూర్పిడి చేస్తారు. పశుగ్రాసం కోసం కూడా యంత్రాలపైనే అధారపడిన పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం స్థాయిలో యంత్రాలు లేవనేది అక్షర సత్యం. వరికోత యంత్రాలు, గడ్డి కట్టలు కట్టే యంత్రాల కోసం పొరుగు జిల్లాలపై ఆధారపడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి యంత్రాలు వస్తాయా అనేది అనుమానంగా ఉంది. ఇక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ధ హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దానితో పంటలను కోసి తుకాలు వేద్దామన్నా ఎప్పుడు తమవంతు వస్తుందా అని రైతులు ఎదురు చూసే పరిస్థితి దాపరించింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తెలంగాణకు ఆన్నపూర్ణగా పేరుగాంచింది. నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా రైతులు వరిని పండిస్తారు. ఉమ్మడి జిల్లాలో నిజాం సాగర్, శ్రీరాం సాగర్ తోపాటు, 24 ఎత్తిపోతల పథకాలు, సహజ సిద్ధమైన చెరువులలో సమృద్ధిగా నీరు నిల్వ ఉండటంతో వరి విస్తారంగా పండుతుంది. వర్షాకాలం వర్షాలు సమృద్ధిగా పడటంతో సంబంధిత నీరు నీల్వ మరో కారణంగా నిజామాబాద్ జిల్లాలో సూమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, కామారెడ్డి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచానా వేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 560, కామారెడ్డి జిల్లాలో 320 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వరికోత కోసం అవసరమైన యంత్రాలు లేవు. ఉన్నవాటిని ఎలా వినియోగించాలని మండలంలో వ్యవసాయ సహాయ విస్తీర్ణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కోతల షురువైనప్పటికీ ఉన్న హార్వేస్టర్ లు ఉన్నవారి ఏరియాలో తొలుత పంటల నూర్పిడి జరుగుతున్నది. సంప్రదాయ పంటల నూర్పిడి వందల ఎకరాలకు పరిమితం అయింది. ఏప్రిల్ మాసపు ఆకాల వర్షాల భయం రైతులను వెంటాడుతున్నది. ప్రతి సంవత్సరం పొరుగున ఉన్న నిర్మల్, జగిత్యాల, సిరిసిల్లా జిల్లాల నుంచి వరికోత యంత్రాలు వచ్చి పంటల నూర్పిడిలో భాగస్వాములు అయ్యేవి. కానీ, ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా అంతర్ జిల్లా సరిహద్దులను మూసివేయడంతో స్థానికంగా ఉన్నవాటితోనే సరిపెట్టుకొని రైతులు పంటల కోతలను చేయాల్సిన పరిస్థితి దాపురించింది. వరికోత యంత్రాల కొరతను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు హర్వేస్టర్ల యాజమానులు. గంటకు ప్రస్తుతం ఉన్న రూ.1700 నుంచి 2000 లకు ధరలను పెంచారు. లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం కోతల ధరలు కొండెక్కడం ఖాయం. ఇదే జరిగితే పంటల కోతలు ఆలస్యం కావడం ఖాయమనిపిస్తోన్నది.
ఇక పంటలను కోసిన తరువాత కాంటాలకు( తూకాలు) వేసే చోట ఉమ్మడి జిల్లాలో బీహార్, మహరాష్ర్ట, మధ్య ప్రదేశ్ కు చెందిన హమాలీలు పనిచేసేవారు. జనతా కర్ప్యూ తరువాత జిల్లా చేరాల్సిన వారు లాక్ డౌన్ కారణంగా వారు స్వస్థలాలకు పరిమితం అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన మద్దత్తు ధర ఉంది.. కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.. ఎలక్ట్రానిక్ తూకాలు ఉన్నా హమాలీలు లేని పరిస్థితి ఉంది. దానితో రైతుల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి లాగా మారింది. హమాలీలుగా ప్రస్తుతం రైస్ మీల్లులలో పనిచేస్తున్నవారిని రప్పించే ఏర్పాట్లు జరగుతున్నా అక్కడ మిల్లింగ్ జరుగాలన్నా కూడా హమాలీల అత్యవసరం ఉంది. స్థానికంగా ఉన్న యువతను ఎక్కువ రెట్టింపుకు, వ్యవసాయ కూలీలతో తూకాలను సొసైటీలు, వ్యాపారులు చేసుకోని తూకాలు వేస్తున్న ఆ భారం కుడా రైతులపై మోపే పరిస్థితి ఉంది. పంటలు కోసే యంత్రాల కొరత, హమాలీల కొరతను ఎదుర్కొని వరి పంటల లాభాన్ని పొందాలంటే లాక్ డౌన్ వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
Tags: Nizamabad, Rice Harvesting, Rice Cutter, Problems, Corona, Hamali Workers