- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బికి ప్రియాంక సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్
దిశ, వెబ్‌డెస్క్: యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు ఇన్‌స్టాగ్రాంలో 51 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతుండగా… సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్న ప్రియాంక అభిమానులతో చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కరోనా గురించి పలు ప్రశ్నలు అడగగా… ప్రపంచ ఆరోగ్య సంస్ధ చీఫ్ టెడ్రోస్ అధనోమ్‌తో వీడియో కాల్ మాట్లాడి మరి వారి సందేహాలు నివృత్తి చేసింది. ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్ విసిరారు. 51 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న ప్రియాంక ద్వారా కరోనా వైరస్‌పై చాలా మందికి అవగాహన కలిగే చాన్స్ ఉందనేది ఆయన అభిప్రాయం.
ఈ చాలెంజ్‌ను స్వీకరించిన ప్రియాంక .. వేర్ ఎవర్ యూ ఆర్ వాష్ యువర్ హ్యాండ్స్… హూ ఎవర్ యూ ఆర్ వాష్ యువర్ హ్యాండ్స్… ఇట్స్ సింపుల్ థింగ్ టు డు… లెట్స్ డు ఇట్ ఫర్ మి అండ్ యు… హూ ఎవర్ యూ ఆర్ వాష్ యువర్ హ్యాండ్స్ (మీరు ఎక్కడున్నా చేతులు శుభ్రం చేసుకోండి…మీరు ఎవరైనా సరే చేతులు శుభ్రం చేసుకోండి… ఇది చాలా సులభమైన పని… నా కోసం మరియు మీకోసం చేయండి… ) పాట పాడుతూ కరోనా ప్రభావం చూపుతున్న సమయంలో చేతులు శుభ్రం చేసుకునే విధానాన్ని, అవసరాన్ని వివరించింది. ట్రెడోస్ విసిరిన ఈ చాలెంజ్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశానని… బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను నామినేట్ చేస్తున్నానని తెలిపింది.