ఆ మూడు సినిమాలే నిలబెట్టాయి : ప్రియాంక

by Shyam |   ( Updated:2023-06-06 06:26:54.0  )
ఆ మూడు సినిమాలే నిలబెట్టాయి : ప్రియాంక
X

దిశ, వెబ్‌డెస్క్ :
యూనివర్సల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తన ఇండియన్ సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. ప్రారంభమైన చోటును తలచుకుంటే.. మరొక జీవితకాలం ఉన్నట్లుగా అనిపిస్తోందని చెప్పింది. ఇదంతా స్టార్ట్ అయినప్పుడు సినిమాలతో ప్రేమలో పడ్డానని తెలిపిన ప్రియాంక.. భారతీయ సినిమాల్లో ఉండటమనేది మ్యాజికల్ వరల్డ్‌లోకి ప్రవేశించడం లాంటిదని అభిప్రాయపడింది. ఏమీ ఆశించకుండా.. ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే గుడ్డిగా ఇందులోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇది తను ఎదుర్కొన్న సవాళ్లు, చేరుకున్న మైలురాళ్ల రోలర్ కోస్టర్ రైడ్ అన్న ప్రియాంక.. ఈ ప్రయాణంలో ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నట్లు చెప్పింది. ప్రారంభంలో తనకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.

గతాన్ని రివైండ్ చేసుకున్న ప్రియాంక… ఇళయ దళపతి, తమిళ్ సూపర్ స్టార్ విజయ్‌తో చేసిన ‘తమిళన్’, సన్నీడియోల్ హీరోగా వచ్చిన ‘ది హీరో’, అక్షయ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘అందాజ్’ చిత్రాలు తనను ఊహించని పథంలో నిలబెట్టాయని తెలిపింది. ఈ చిత్రాల నిర్మాతలు, దర్శకులకు థాంక్స్ చెప్తూ.. అందుకు సంబంధించిన మెమొరీస్ షేర్ చేసింది ప్రియాంక.

Advertisement

Next Story