- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్టర్ – నిర్మాతల మధ్య కోల్డ్ వార్..
దిశ, సినిమా : దర్శకుడు ప్రియదర్శన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు నిర్మాత ఫిరోజ్ నడియాడ్వాలా. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కామెడీ ఫిల్మ్ ‘హేరా ఫేరి’ ప్రియదర్శన్ డైరెక్షన్‌లోనే రాగా.. అసలు ఆ సినిమా క్రెడిట్స్ అతనికి దక్కకూడదన్నట్లుగా వ్యాఖ్యానించారు ఫిరోజ్. ముందుగా సినిమా మొత్తం డిప్రెషన్ సీన్లతో ఉందని, దాదాపు 3గంటల 40 నిమిషాల మూవీని ఎలాంటి కటింగ్ లేకుండానే సబ్మిట్ చేశాడన్న ఆయన.. హ్యూమరస్ టచ్ ఉన్న డైలాగ్స్ అన్ని డిలీట్ చేశాడని చెప్పాడు. దీంతో డైరెక్టర్- రైటర్ నీరజ్ ఓరా, కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ హెల్ప్‌తో సినిమా మొత్తం మార్చేశామని.. పంచ్ లైన్స్ యాడ్ చేస్తూ చాలా ఇంప్రువైజ్ చేశామన్నాడు. ప్రియదర్శన్ ఈ సినిమా నటులకు( పరేష్ రావల్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి) సీక్వెల్ చేయొద్దని సూచించాడని ఆరోపిస్తూ.. మూవీ రైట్స్ కూడా తమకు తెలియకుండానే పంజాబీ నిర్మాతకు ఆమ్మేశాడని తెలిపాడు.
కాగా దీనిపై స్పందించిన దర్శకుడు ప్రియదర్శన్.. సీక్వెల్‌ను డైరెక్ట్ చేయలేదన్న కోపం, ఫ్రస్ట్రెషన్‌లో ఫిరోజ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. ఒక రీమేక్ సినిమాను మూడు గంటల 40 నిమిషాలు ఎలా డైరెక్ట్ చేస్తానని ప్రశ్నించిన ఆయన.. సినిమా మొత్తం చెన్నైలోనే షూట్ చేశామని, తన థియేటర్‌లోనే మిక్సింగ్ కూడా జరిగిందని, ఆ తర్వాత ఫైనల్ కాపీ సబ్మిట్ చేశానని తెలిపాడు. ఒక రీమేక్ మూవీ రైట్స్ అమ్మే హక్కు తనకు ఉండదని, ఈ కథ రాసిన ఒరిజినల్ మలయాళం ఫిల్మ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ సిద్ధిఖ్-లాల్‌లకు మాత్రమే ఉంటుందన్నారు. అలాగే వారు వేరే వాళ్లకి రీమేక్ రైట్స్ ఇస్తే.. మేము వారి నుంచి రూ.5 లక్షలకు కొనుగోలు చేసి సినిమా ప్రారంభించామని వివరించాడు. ఇక నటులతో బెస్ట్ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు సీక్వెల్ చేయొద్దని తానెందుకు సూచిస్తానని ప్రశ్నించాడు.