- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది నా పర్సనల్.. నేను ఏం చేస్తే మీకెందుకు : ప్రియా వారియర్ ఫైర్
దిశ, సినిమా : వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం మాస్కో ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్లో ప్రతీ క్షణం ఆస్వాదిస్తున్న ప్రియ అండ్ ఫ్రెండ్స్.. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్, వ్లోగ్స్ షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆటోమేటిక్‌గా వీటిని వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లో షేర్ చేయగా అనవసరమైన కామెంట్స్ ఎదురయ్యాయి. దీంతో వీటన్నింటికి సమాధానమిచ్చింది.
‘నా ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో షేర్ చేయబడిన వ్లోగ్స్పై అందరూ చూపిస్తున్న కన్సర్న్కు అభినందనలు. కానీ ఈ వీడియోలపై అనసరమైన చర్చ పనికిరాదు. వాట్సాప్, ఫేస్బుక్లో ఫార్వార్డ్ చేయడం.. సిల్లీ టైటిల్స్, కామెంట్స్‌తో యూట్యూబ్, టిక్‌టాక్‌లో డిస్కషన్ అవసరమా? దయచేసి ప్రేక్షకులకు అవసరమయ్యే ప్రామాణికమైన కంటెంట్‌ను అందించేందుకు ప్రయత్నించండి. ఇలాంటి టైమ్‌వేస్ట్ స్టోరీస్ మీడియాకు అవసరం లేదనుకుంటా. మరీ ముఖ్యంగా నా స్నేహితులతో ఏం చేస్తాను? నా జీవితాన్ని ఎలా గడుపుతాను అనేది పూర్తిగా పర్సనల్. కాబట్టి మీ అభిప్రాయాలను మీ వద్దే ఉంచుకోవడం మంచిది’ అని సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది.
https://www.instagram.com/reel/CRitLHMgr5h/?utm_source=ig_web_copy_link