- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు భారీ షాక్.. హుజురాబాద్ బరిలో టీచర్లు..
దిశ, కరీంనగర్ సిటీ : సీఎం కేసీఆర్‌కు మరో భారీ షాక్ తగిలింది. ప్రైవేట్ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 100 మంది ప్రైవేట్ లెక్చరర్లు పోటీ చేయనున్నట్లు , తెలంగాణ లెక్చరర్ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మనోహర్ తెలిపారు.
గురువారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రైవేటు టీచర్లకు రూ. 2000 నగదు, రేషన్ బియ్యం సహాయం అందించినా, ప్రైవేట్ అధ్యాపకులకు మాత్రం మొండి చేయి చూపించి సర్కార్ అన్యాయం చేసిందని ఆరోపించారు. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు నెలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ అధ్యాపకులకు జీతాలు చెల్లించాలని మనోహర్ డిమాండ్ చేశారు.
అయితే ఇప్పటికే హుజురాబాద్‌లో తాము పోటీ చేస్తామంటూ 1000 మంది ఫీల్ట్ అసిస్టెంట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారిని విధుల నుంచి తొలగించిన కారణంగానే వారు హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. తాజాగా ప్రైవేటు టీచర్లు సైతం వారి పోటీకి సిద్ధమన్నారు.