ప్రైవేటు ఆసుపత్రులకు షాక్.. మరో చట్టాన్ని వెలికి తీసిన జగన్ సర్కారు…!

by srinivas |
ప్రైవేటు ఆసుపత్రులకు షాక్.. మరో చట్టాన్ని వెలికి తీసిన జగన్ సర్కారు…!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం మరోచట్టాన్ని వెలికి తీసింది. కరోనా వ్యాప్తి నిరోధం నేపథ్యంలో ఇప్పటికే 1897 నాటి బ్రిటిష్ చట్టం ఎపిడమిక్ డిసీజ్ కంట్రోల్ చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా 2005 సెక్షన్ 10(2) 1ను కూడా అమలులోకి తీసుకొచ్చింది.

ఈ చట్టం ప్రకారం ఇకపై ప్రైవేట్‌ వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ప్రైవేటు ఆసుపత్రులు ఇక ప్రభుత్వ ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తొలి దశలో 450 ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వ్యాప్తితో పాటు అప్పటి అవసరాన్ని బట్టి ఈ సంఖ్య పెంచుతామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు.

ఇక ఈ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే… ప్రైవేట్‌/ ప్రభుత్వేతర మెడికల్, హెల్త్‌ ఇనిస్టిట్యూషన్స్, అందులోని సిబ్బంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐసోలేషన్‌ పడకలు, రూములు, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు, టెస్టింగ్‌ ల్యాబ్స్, ఫార్మసీలు, మార్చురీలు, మెడికల్ ఎక్విప్‌మెంట్, అత్యవసర రెస్పాన్స్‌ టీములు ప్రభుత్వ పరిధిలో కరోనా బాధితులకు సేవలు అందించాల్సి వుంటుంది.

ఏ వసతుల వినియోగానికైనా ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి వుంటుంది. ఈ ఆసుపత్రులన్నీ జిల్లా స్థానిక అధికారుల ఆదేశాలపై స్పందించాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు సహా అక్కడ పని చేస్తున్న ఎవరినైనా ప్రభుత్వం ఎక్కడైనా నియమించవచ్చు. దీంతో కరోనా కట్టడి సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది.

Tags: corona virus, apedimic act 1897, 2005 section 10(2)1, 450 hospitals

Advertisement

Next Story

Most Viewed