పశ్చిమగోదావరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్

by  |
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ముందస్తు అనుమతులు తీసుకోకుండా కరోనా రోగులకు చికిత్స చేయడమే కాకుండా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా వైద్యాధికారులు ఏలూరులోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తనిఖీ చేశారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు విచారణలో వెల్లడికావడం, ఒక్కొ రోగి నుంచి రోజుకు రూ. లక్ష ఫీజు వసూలు చేస్తుండటంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed