- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శాండల్‌వుడ్ క్లైమాక్స్ స్టోరీ చెప్పకుండానే..
మాలీవుడ్ డైరెక్టర్ ‘సాచి’ ఆకస్మిక మరణం హీరో పృథ్విరాజ్‌ను చాలా ఆవేదనకు గురి చేసింది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాతో నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సాచి మృతితో నాలో కొంత భాగం తనతోనే వెళ్లిపోయింది’ అన్నారు పృథ్వి. లేట్ నైట్ కాల్స్, మెసేజెస్, ఐడియాస్ షేరింగ్.. అన్ని అన్నీ ఇక్కడితో ముగిశాయంటే చాలా వెలితిగా ఉందని బాధపడిపోయారు. ‘నీ ఆలోచనలు, కలలు తెలిసిన మిత్రుడిగా చెప్తున్నా.. అయ్యప్పనుమ్ కోషియుమ్ అనేది నువు అందుకున్న ఉన్నతి కాదు.. ప్రారంభం మాత్రమే’ అన్నారు పృథ్వి.
View this post on InstagramA post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on
సాచి గురించి తెలుసుకోవడం తన జీవితంలోనే ఒక గొప్ప విశేషమని చెప్పిన పృథ్వి… అతడు ఉండి ఉంటే 25 ఏళ్ల మలయాళ ఇండస్ట్రీ భవిష్యత్‌తో పాటు తన కెరియర్ కూడా చాలా భిన్నంగా ఉండేదన్నారు. ‘సాచి.. నువు ఎప్పుడూ చెప్పే వాడివి.. నువ్వు నేను ఒకేలా ఆలోచిస్తామని.. కానీ ఇప్పుడు అర్థమైంది నువు చాలా భిన్నమని’ అన్నారు. ఇక నుంచి ప్రతీ రోజూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను మిత్రమా అన్న పృథ్వి.. నువ్వు ఇప్పటికీ కూడా శాండల్‌వుడ్ క్లైమాక్స్ స్టోరీ చెప్పలేదు. పర్లేదు బ్రదర్ బాగా రెస్ట్ తీసుకోండి.. మేధావి మిస్ యూ’ అంటూ సాచికి వీడ్కోలు పలికారు పృథ్వి.