- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎం సమీక్ష… అసహనంలో ఢిల్లీ ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్ ప్రక్రియ, రెమిడెసిఫర్ సప్లైల గురించి ప్రధానంగా చర్చ జరుగుతున్నది.
ఎవరితో మాట్లాడితే పనవుతుందో చెప్పండి : ఢిల్లీ సీఎం
మీటింగ్ లో భాగంగా.. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ లేనందుకు ఢిల్లీ ప్రజలు చనిపోవాలా..? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఎవరితో మాట్లాడితే తమ అవసరాలు తీరుతాయో చెప్పండని ఈ సందర్భంగా ఆయన ప్రధానిని కోరారు.