- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించగలం : ప్రధాని
దిశ, వెబ్ డెస్క్: రక్షణ రంగంలో మన దేశం అన్ని దేశాలకంటే ముందుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ.. 2020 ఎన్నో సమస్యలు తెచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని, ఎలాటి ఇబ్బందులనైనా అధిగమించగలమని మన చరిత్ర చెబుతోందన్నారు. భారత్ ఎప్పుడూ సమస్యలను అవకాశాలుగా మార్చుకుంటుందని తెలిపారు. సమస్యలు వచ్చినప్పుడే మన బలం పెరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కరోనా వచ్చి ఆరు నెలలు అయిపోయిందన్న మోదీ… అందరూ 2020 ఎప్పుడు అంతమవుతుందా అని ఆలోచిస్తున్నారని అన్నారు. చైనా వివాదంపై స్పందించిన మోడీ.. లడక్‌లోకి వచ్చేందుకు యత్నించిన చైనా సైన్యానికి భారత సైన్యం తగిన బుద్ధి చెప్పిందన్నారు. దేశానికి సమస్య వచ్చే పరిస్థితి రానివ్వబోమని మన సైనికులు నిరూపించారని, మొన్నటి ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులవ్వడంపై దేశంలోని ప్రతిఒక్కరూ చాలా బాధపడుతున్నారని అన్నారు. అమరులైన సైనికుల తల్లిదండ్రులు మరింత మందిని సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.