ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

by srinivas |   ( Updated:2021-10-31 21:30:23.0  )
225
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ రాష్ట్రాల నివాసితుల ఉజ్వల భవిష్యత్తు కోసం నా శుభాకాంక్షలు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ కూడా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేకమంది పోరాట ఫలితంతో ఏర్పడిన ఏపీ స్ఫూర్తిదాయకమన్నారు. అభివృద్ధిలో ఏపీ మరింత ముందుకు వెళ్లాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story