- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమతా బెనర్జీపై ప్రధాని మోడీ ఆగ్రహం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం విరుచుకుపడ్డారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలను తృణమూల్ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని, రైతుల సమాచారం లేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించలేకపోతున్నామని వివరించారు. ‘జై శ్రీరాం’ అని వినిపిస్తే కోపగించుకునే మమతా బెనర్జీ దేశ వ్యతిరేక నినాదాలపై మాత్రం ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తారని ఆరోపించారు.
దేశ ప్రతిష్టను దెబ్బతీసే అంతర్జాతీయ కుట్రలపై మౌనం వహిస్తారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అసోం, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటించారు. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తొలి ఎన్నికల ప్రచార క్యాంపెయిన్‌లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. స్వాతంత్ర్యానంతరం పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి జరగనే లేదని అన్నారు. మమత బెనర్జీ ప్రభుత్వం తొలి నాళ్లలో వామపక్షాలు కొంతమేర పుంజుకున్నాయని తెలిపారు.
వామపక్షాలు పునరుజ్జీవం చెందడమంటే అవినీతి, నేరాలు, హింస, ప్రజాస్వామ్యంపై దాడులు పెరగడమేనని అభిప్రాయపడ్డారు. హల్దియాలో 348 కిలోమీటర్ల దోబి దుర్గాపూర్ సహజవాయువు పైప్‌లైన్, నాలుగుదారుల బ్రిడ్జీని ప్రారంభించారు. బెంగాల్ పర్యటనకు ముందు ఆయన అసోంలో రెండు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్‌కు శంకుస్థాపన చేశారు. భారత తేయాకు పరిశ్రమను దెబ్బతీసే అంతర్జాతీయ కుట్ర జరుగుతున్నదని ప్రధాని మోడీ సొనిట్‌పూర్ జిల్లాలో మాట్లాడారు.
ఈ కుట్ర వెనుకున్నవారెవరినీ వదిలిపెట్టబోరని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అసోంలో ఆరు మెడికల్ కాలేజీలు ఉండేవని, కేవలం గత ఐదేళ్లలో మరో ఆరు మెడికల్ కాలేజీలకు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. ప్రతిరాష్ట్రంలో ప్రాంతీయ భాషలో బోధించే మెడికల్ కాలేజీ, టెక్నికల్ కాలేజీ ఉండాలన్నది తన కల అని అన్నారు. అసోంలో చదివితే డాక్టర్లు కాలేరా? అంటు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఈ కలను నిజం చేస్తామని తెలిపారు.