- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొన్ని వారాల్లో వ్యాక్సిన్ : ప్రధాని
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారికి టీకా కొన్ని వారాల వ్యవధిలోనే అందుబాటులోకి వస్తుందని, శాస్త్రజ్ఞులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే టీకా వేసే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు. కరోనా వైరస్‌పై ముందుండి పోరాడిన వైద్య సిబ్బందికి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వయోధికులకు మొదటగా టీకా వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని తెలుపుతూ రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే టీకా ధర ఖరారు చేస్తామని వివరించారు. వ్యాక్సిన్ ధరతోపాటు దాని పంపిణీపై త్వరలో రాష్ట్రాలతో మాట్లాడనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అఖిలపక్ష సమావేశంలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన 12 మంది నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బంధోపాద్యాయ్, ఎన్‌సీపీ నుంచి శరద్ పవార్, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్ రావు, శివసేన నుంచి వినాయక్ రౌత్‌లు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, హర్షవర్ధన్, ప్రహ్లాద్ జోషి, అర్జున్ రాం మేఘావాల్, వీ మురళీధరన్‌లూ హాజరయ్యారు.
భారత్‌లో 8 టీకాలు ఉత్పత్తి
భారత్‌లో ఎనిమిది వ్యాక్సిన్‌లు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయని, ఇవి ఇక్కడే ఉత్పత్తి అవుతాయని ప్రధాని మోడీ తెలిపారు. దేశీయంగా మూడు టీకాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. టీకా మరెంతో దూరం లేదని, వారాల వ్యవధిలో ఇక్కడ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. దేశంలోని నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. ప్రభుత్వాలతో సహకారంతో టీకా పంపిణీకి అవసరమైన శీతలీకరణ గిడ్డంగులు, లాజిస్టికల్ ఇతర సదుపాయాల అవసరాలను అంచనా వేస్తామని, టీకా స్టాక్, రియట్ టైంలో దాని వివరాలను తెలిపే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రపంచమంతా సురక్షితమైన, చౌకైనా టీకా కోసం ఎదురుచూస్తుందని, అందుకే భారత్ వైపు చూస్తోందని అన్నారు. టీకా పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర బృందాలు కలిసి పనిచేస్తున్నాయని, వ్యాక్సిన్ పంపిణీలో భారత్‌కు సరిపడా అనుభవమున్నదని వివరించారు.