- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవీకే సంస్థ ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న కంపెనీ
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే నిధుల మళ్లింపు వ్యవహారంలో ఈడీ (ED)కేసులతో ఇబ్బంది పడుతున్న జీవీకే (GVK) సంస్థకు మరో షాక్ తగిలింది. కంపెనీ ఆడిటింగ్ (Company auditing) వ్యవహారాలను చూసుకునే అంతర్జాతీయ ఆడిటింగ్ కంపెనీ (International Auditing Company) ప్రైస్ వాటర్‌హౌస్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించింది.
ఆడిటింగ్ (auditing) లో భాగంగా అవసరమైన సమాచారాన్ని ఇవ్వనందుకే జీవీకే (GVK)సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాలను చూడలేమని ప్రకటించింది. 2017 ఏడాదిలో తమ కంపెనీ ఆడిటర్ (Auditor)ను నియమించామని, ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నామని, అయితే..2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కావాల్సిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటివరకూ ఇవ్వలేదని కంపెనీ పేర్కొంది. ఇదివరకే అనేకమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ జీవీకే (GVK)సంస్థ నుంచి స్పందన లేదని ప్రైస్ వాటర్‌హౌస్ కంపెనీ (Price Waterhouse Company) పార్ట్‌నర్ వరదరాజన్ తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ (auditing) ఇప్పటికే పూర్తి కావాల్సినప్పటికీ.. కీలకమైన సమాచారం కంపెనీ నుంచి ఇంకా రాలేదని, అందుకే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆడిటింగ్ (auditing) ఇచ్చిన లేఖలో వివరించారు. కంపెనీకి చెందిన అంశాల గురించిన లెక్కలు చెప్పాలని కోరినప్పటికీ..స్పందించలేదని కాబట్టి ఆడిటింగ్ చేయలేమని, ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని వరదరాజన్ లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల జీవీకే (GVK) సంస్థపై సీబీఐ కేసు (CBI Case) నమోదు చేసింది. ముంబై విమానాశ్రమానికి సంబంధించి రూ. 705 కోట్ల వరకు దారి మళ్లించిన ఆరోపణలు కంపెనీపై ఉన్నాయి. ఇందులో భాగంగానే జీవీకే సంస్థకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.