- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చికెన్ వ్యాపారి కారుకు ప్రెస్ స్టిక్కర్… పట్టుకున్న పోలీసులు..చివరికి
దిశ, సికింద్రాబాద్ : కారుపై ప్రెస్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతున్న తార్నాకాకు చెందిన చికెన్ వ్యాపారి పై చిలకలగూడ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అతని వద్ద నుండి కారు స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు చిలకలగూడ పోలీసులు. చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ నరేష్ తెలిపిన వివరాల మేరకు… ప్రెస్ స్టిక్కర్ తో ఉన్న కారు యజమానిని అనుమానం వచ్చి ఐడీ కార్డు చూపమని అడుగగా తాను రిపోర్టర్ కాదని చికెన్ వ్యాపారినని ఒప్పుకున్నాడని తెలిపారు. కేవలం లాక్‌డౌన్ సమయంలో మీడియాను అనుమతించాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకొని కారుపై ప్రెస్ స్టిక్కర్ ను అంటించుకొని కారులో తిరుగుతున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
కారును స్వాధీనం చేసుకొని యజమాని పై చీటింగ్ కేసు నమోదు చేసామని వెల్లడించారు. సీపీ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కరోనా, లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.