- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ఢిల్లీ సర్కార్.. లెఫ్టినెంట్ గవర్నర్
న్యూఢిల్లీ : పార్లమెంటు పాస్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లు ఢిల్లీ ప్రభుత్వానికి డెఫినేషన్ చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే అని స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రపతి ఆమోదం పొందగానే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి ఢిల్లీ ప్రభుత్వం నిర్వహణ సంబంధ విధానాలు, కార్యాలన్నింటికీ ముందస్తుగా లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయాన్ని తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ బిల్లును లోక్‌సభ 22న రాజ్యసభ 24న ఆమోదించింది. ప్రతిపక్షాలు ఈ బిల్లుపై గగ్గోలు పెట్టాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాలను లాక్కుందని, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా తమ చేతుల్లోకి తీసుకున్నదని ఆరోపించాయి. ఇది భారత సమాఖ్యస్ఫూర్తికే విరుద్ధమని, ఈ బిల్లు రాజ్యాంగవ్యతిరేకమని విమర్శించాయి.