రాష్ట్రపతి, గవర్నర్ ఫోన్ సంభాషణ..!

దిశ వెబ్‎డెస్క్: రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్‎తో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఫోన్‎లో సంభాషించారు. జాతీయ విద్యా విధానంపై శుక్రవారం రాష్ట్రపతితో తమిళిసైతో మాట్లాడారు. విద్యావేత్తలతో నిర్వహించనున్న వెబ్‌నార్‌ గురించి తమిళిసై రాష్ట్రపతికి వివరించారు. ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి, వైస్‌ ఛాన్సులర్లు పాల్గొంటారు. ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అనే అంశంపై విద్యావేత్తలతో గవర్నర్ తమిళిసై వెబ్‌నార్‎ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement