ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్య అవార్డులు అందజేత

by Shyam |   ( Updated:2020-09-25 12:52:29.0  )
ఇంజినీర్లకు విశ్వేశ్వరయ్య అవార్డులు అందజేత
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ప్రతిభ కనబరిచిన ఇంజినీర్లకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శుక్రవారం విశ్వేశ్వరయ్య అవార్డులను అందజేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 161 జయంతిని పురస్కరించుకుని మెగా సిటీ కళావేదిక ఆధ్వర్యంలో అవార్డులను అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇంజినీర్లు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. భవిష్యతులో మరిన్ని ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విద్యుత్, ఇతర రంగాల్లో మరింత కృషి చేయాలన్నారు.

Advertisement

Next Story