ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం

by Sridhar Babu |
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం
X

దిశ,గీసుగొండ : ఆర్టీసీ బస్సు ఢీకొని యువ మెకానిక్ మృతి చెందిన ఘటన వరంగల్ మహానగరపాలక సంస్థ 16వ డివిజన్ గొర్రెకుంటలో చోటు చేసుకుంది. గీసుగొండ సీఐ ఎ. మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట సోమ్ల తండాకు చెందిన భూక్య జయచంద్ర ప్రస్తుతం వరంగల్ జిల్లా బీటు బజారులో నివాసం ఉంటూ హనుమాన్ జంక్షన్ లో గల మహాదేవ్ కార్ కేర్ లో మెకానిక్ గా పనిచేస్తున్నాడు.

కాగా సోమవారం రాత్రి జయచంద్రతో పనిచేసే తోటి మెకానిక్ నాగుల రాజ్ కుమార్ ఫోన్ చేసి గొర్రెకుంట శివారులో కారు బ్రేక్ డౌన్ అయిందని, వెళ్లి రిపేర్ చేసి రమ్మని చెప్పగా జయచంద్ర తన బైక్​పై వెళ్లి కారు రిపేరు చేసి రాత్రి 12 గంటలకు తిరిగి వరంగల్ వైపు వెళ్తుండగా గొర్రెకుంట క్రాస్ రోడ్ వద్ద మూలమలుపు తిరుగుతుండగా వరంగల్​ నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దాంతో జయచంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మామునూరు ఏసీపీ తిరుపతి సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడి తండ్రి భుక్య జవహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ తెలిపారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed