- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఇది మంచి పద్దతి కాదు’.. HCU వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి రెవెన్యూ సర్వే నం.25లో గల 400 ఎకరాల భూమిపై ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తోంది. భూముల వేలం తక్షణమే ఆపాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు గతకొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)తో ఎటువంటి సంబంధం లేదని, ముమ్మాటికీ ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని దేశసర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే తేల్చి చెప్పిందని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం(Congress Government) వాదిస్తోంది. లేదు.. ఆ భూమి హెచ్‌సీయూదే అని విద్యార్థులు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్( Actor Prakash Raj) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు.. ప్రకృతిని నాశనం చేయడానికి పూనుకోవడం, అడ్డొచ్చిన విద్యార్థులను హింసించడం సరైంది కాదు.. ఇలాంటి దారుణమైన చర్యకు వ్యతిరేకంగా నేను విద్యార్థులు మరియు పౌరులకు మద్దతు ఇస్తున్నాను.. మన భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలి’ అని నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) పిలుపునిచ్చారు.
This distruction is not acceptable.. ఇది మంచిది కాదు .. i stand with the students and Citizens against such atrocious act .. 🙏🏿 request everyone to share and amplify this protest for our future #SaveHCUBioDiversity #OxygenNotAuction #SaveHCU#justasking pic.twitter.com/twlUVxoh68
— Prakash Raj (@prakashraaj) April 1, 2025