ఇవీ.. తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసుల వివరాలు

by vinod kumar |
ఇవీ.. తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసుల వివరాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. గత రెండు రోజుల నుంచి వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 117 కొత్త కేసులు నమోదు కాగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో -58, సౌదీ అరేబియా నుంచి వచ్చినవారిలో -49, రంగారెడ్డి జిల్లాలో -5, వలస కార్మికుల్లో -2, మేడ్చల్ జిల్లాలో- 2, సిద్ధిపేటలో ఒక కేసు నమోదైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1908 కు చేరుకోగా అందులో 1,345 మంది బాధితులు ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినారు. 844 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా తాజాగా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కి మరో నలుగురు మృతి చెందగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 67కు చేరుకున్నది.

Advertisement

Next Story

Most Viewed