ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

by vinod kumar |
ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రజలు దాని కోరలకు చిక్కి అల్లాడిపోతున్నారు. శుక్రవారం ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 143 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ లో -116, రంగారెడ్డి జిల్లాలో -8, మహబూబ్ నగర్ జిల్లాలో -5, వరంగల్ జిల్లాలో -3, ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో -2 చొప్పున, మంచిర్యాలలో 1 కేసు నమోదైనట్లు నిర్ధారణ అయ్యింది. కాగా, ఇప్పటివరకు మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3290 కు పెరిగింది. అందులో ఇప్పటివరకు ఆస్పత్రి నుండి 1627 మంది డిశ్చార్జ్ కాగా, 1550 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 113 కు చేరుకున్నది.

Advertisement

Next Story

Most Viewed