- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురిటినొప్పులు.. ఆస్పత్రికి చేరుకోకుండానే తల్లిబిడ్డా క్షేమం
by Shyam |
X
దిశ, గండీడ్ : పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు వైద్యసిబ్బంది అంబులెన్సులోనే ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని పగిడ్యాల్ గ్రామానికి చెందిన శ్వేత అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అనుకోకుండా మహిళకు పురిటినొప్పులు అధికం అయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఆమెకు బుధవారం ఉదయం సుఖప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు శ్వేత జన్మనిచ్చింది. తల్లిబిడ్డా క్షేమంగా ఉండటంతో అంబులెన్సు సిబ్బంది ఈఎంటి శ్రీనివాస్, ఫైలెట్ అక్బర్‌లను కుటుంబ సభ్యులు అభినందించారు.
Advertisement
Next Story