గ‌ర్భిణీ స్త్రీలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలి : కార్పొరేట‌ర్ ముద్దం రాము

by Shyam |
గ‌ర్భిణీ స్త్రీలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవాలి : కార్పొరేట‌ర్ ముద్దం రాము
X

దిశ, గండిపేట్ : గ‌ర్భిణీలు అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని హిమాయ‌త్‌సాగ‌ర్ కార్పొరేట‌ర్ ముద్దం రాము అన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు పౌష్టిక ఆహారంపై అవగాహ‌న క‌ల్పించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట‌ర్ ముద్దం రాము అంగన్వాడీ సూపర్వైజర్ మన్నెమ్మతో క‌లిసి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ రాము మాట్లాడుతూ.. గ‌ర్బిణీగా ఉన్నప్పటి నుంచే పౌష్టికాహారం తీసుకోవ‌డం వ‌ల్ల బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం జ‌రుగుతుంద‌న్నారు. అంతేకాకుండా చిన్నారుల‌కు సైతం పౌష్టికాహారాన్ని అందించాల‌న్నారు. తద్వారా చిన్నారుల ఎదుగుద‌ల బాగా ఉంటుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుజాత, పద్మ, గర్భిణీ మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story