- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగామలో గర్భిణీకి కరోనా పాజిటివ్
దిశ, వరంగల్
జనగామ మండలం ఎల్లంల గ్రామానికి చెందిన ఓ గర్భిణీ మహిళకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ నెల 14న హన్మకొండలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా ప్లేట్ లెట్స్ తగ్గాయని వెల్లడైంది. దీంతో ఆ మహిళను అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ముందుగా హైకోర్టు ఏరియాలో ఉన్న పేట్లబుర్జు మాడ్రన్ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించగా, మళ్లీ అక్కడి నుంచి ఉస్మానియాకు షిప్టు చేశారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నదని తెలుసుకున్న వైద్య సిబ్బంది మే31న ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. జూన్ 1న తేదీన వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ గర్బిణీ 18 రోజుల కిందటే గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లడంతో స్థానికంగా ఎటువంటి టెన్షన్ వాతావరణం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు వలస కార్మికులు, మర్కజ్ లింకుతో మాత్రమే పాజిటివ్ కేసులు నమోదైన తరుణంలో..లోకల్‌గా గర్భిణీకి వైరస్ ఎలా సోకిందనే అంశంపై ఆందోళన నెలకొంది.అయితే హన్మకొండ లేదా హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆమెకు వైరస్ అటాక్ అయి ఉండవచ్చునని డాక్టర్లు భావిస్తున్నారు. మొదటిసారిగా ఎల్లంల గ్రామంలో కరోనా కేసు నమోదు కావడంతో పోలీసులు గ్రామానికి వెళ్లి సర్పంచ్ సుజాతను కలిసి వివరాలు సేకరించారు.