- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరద వాగును దాటి మగబిడ్డకు జన్మనిచ్చింది
దిశ, ఖమ్మం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో ఆ ఊరికి ఆనుకుని ఉన్న వాగు ఉప్పొంగింది. గ్రామానికి చేరుకునే వెళ్లే మార్గాలన్ని వాగు వరదలో మూసుకుపోయాయి. ఇంతలోనే ఆ ఊరి ఆడబిడ్డకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఊరి నుంచి వాహనం ద్వారా వాగు దాటి బయటపడే మార్గం కనిపించలేదు. క్షణక్షణానికి పెరుగుతున్న నొప్పులతో ఆ గర్బిణి బాధ భరించలేకపోయింది. చివరికి దేవుడు మీద భారం వేసిన కుటుంబ సభ్యులు దిగబాటు బురదలోనే.. నడుంలోతు వరద నీటిలో గర్బిణిని కిలోమీటర్‌కు పైగా నడిపించుకెళ్లారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రాళ్ల గడ్డ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన ఈసం సంధ్యారాణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు 108కి కాల్ చేశారు. అయితే వాగు అడ్డుగా ఉండటంతో దాటి రావడం అసాధ్యమని సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమీ లేక గ్రామం నుంచి బురద రోడ్డుపై నుంచి నడుంలోతు వాగు వరద నీటిలోంచి నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఆ తర్వాత కొద్ది దూరం నడిచాక 108 వాహనం ద్వారా ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో సంధ్యారాణి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే, ఈ సంఘటనపై కలెక్టర్ ఎంవీరెడ్డి సీరియస్ అయ్యారు. నెలలు నిండిన ర్బిణులను ఆస్పత్రికి తరలించాల్సిన బాధ్యత ఏఎన్ఏంలపై ఉందని అన్నారు. ఈ సంఘటనపై జిల్లా వైద్యాశాఖ అధికారి భాస్కర్‌ను విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు.