- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనసుంటే మార్గముంటది : ప్రీతి జింతా
కరోనా వల్ల అందరి జీవితాల్లోనే కాదు.. ప్రపంచాన్ని చూసే కోణంలోనూ మార్పొచ్చింది. కరోనా కోరల నుంచి బయటపడకపోయినా.. అందరూ తమ తమ పనుల్లో మాత్రం మళ్లీ బిజీ అయిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా తమ రెగ్యులర్ లైఫ్‌లోకి సైన్ ఇన్ అవుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా.. బ్రూనో ( తన పెంపుడు కుక్క)తో హ్యాపీగా చిల్ అవుట్ అవుతోంది. మనసును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచడం కోసం ఓ వైపు ఎక్సర్‌సైజులు చేస్తోంది. మరోవైపు రిలాక్సేషన్ కోసం స్మాల్ ట్రిప్ కూడా వెళ్లొచ్చింది. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుందీ బ్యూటీ.
తన భర్త జెనీ గుడెనఫ్‌తో కొద్ది రోజులుగా లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న ప్రీతి జింతా.. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ‘మనసుంటే మార్గముంటుంది. నా వర్కవుట్స్‌ను డిస్టర్బ్ చేయడానికి బ్రూనో ఎంతగానో ట్రై చేసింది. కానీ నా పతి పరమేశ్వరుడు నా పుషప్స్ పూర్తి చేయడానికి బ్రూనోను అడ్డుకుని నాకు సహకరించాడు. ఇది మీ జీవితంలో సరైన మార్గంలో ఓ అడుగు వేయడానికి మీకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. డోంట్ గివ్ అప్. జిమ్ యా నో జిమ్.. లగే రహో’ అంటూ తన వర్కవుట్ వీడియోతో పాటు ఈ మెసేజ్ అందించింది.
అంతేకాదు తన బ్రూనోతో కలిసి ప్రీతి జింతా ఇటీవలే బీచ్‌కు కూడా వెళ్లి.. సరదాగా గడిపింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిప ప్రీతి.. ‘104 రోజుల తర్వాత ఇది మా మొదటి ట్రిప్. ఈ బీచ్‌లో మాకు మేముగా సరదాగా గడపడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మేమిద్దరం స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది’ అంటూ ఆ ఫోటోలతో ఈ వ్యాఖ్యల్ని జతచేయడం విశేషం.