- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రిలో తిరుపతి తరహా ప్రసాదం కౌంటర్లు..
దిశ, ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుపతి తరహా ప్రసాద విక్రయ కౌంటర్లు ఏర్పాటవుతున్నాయి. నూతన గర్భాలయం సమీపంలో నిర్మాణమవుతున్న ప్రసాద్ విక్రయశాల పనులు ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీ, విక్రయానికి అత్యాధునిక పరికరాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం నాలుగు అంతస్థుల భవనాన్ని ఏర్పాటు చేశారు. కింది నుంచి ప్రసాదాలను పై అంతస్తులోకి తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ కూడా ఇప్పటికే పూర్తయింది. లిఫ్టుల ద్వారా వచ్చినటువంటి ప్రసాదాలను ఎక్స్కలేటర్‌ల ద్వారా కౌంటర్లకు చేరే విధంగా ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. అంతేకాకుండా ఎక్కువగా తయారైన లడ్డూ, పులిహోర ప్రసాదాలను నిల్వ చేయడానికి ప్రత్యేకమైనటువంటి గదులను నిర్మించారు.
ఈ గదుల్లో ఎయిర్ కూలర్‌లను, అత్యా ధునికమైన ఫ్యాన్‌లను అమర్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో భాగంగా కొన్ని కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. ఇలా మొత్తం 15 కౌంటర్ల ద్వారా భక్తులకు లడ్డూ ప్రసాదాలను విక్రయం చేసే విధంగా వైటీడీఏ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ పనులు దాదాపు పూర్తి అయినట్లే అని అధికారులు చెబుతున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద విక్రయశాలల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగితే వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అత్యాధునికమైన మంటలు ఆర్పే పరికరాలను ఏర్పాటు చేశారు.