చిట్ ఫండ్ బాధితులకు అండగా ప్రజాసేన..

by Shyam |   ( Updated:2021-12-13 03:12:25.0  )
చిట్ ఫండ్ బాధితులకు అండగా ప్రజాసేన..
X

దిశ హన్మకొండ టౌన్: చిట్ ఫండ్ బాధితులకు ప్రజాసేన అవినీతి నిరోధక స్వచ్చంధ సంస్థ అండగా ఉంటుందని వ్యవస్థాపక అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు చిట్ ఫండ్ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చీటీల కాల పరిమితి మించి పోయినా డబ్బులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

కొంత మంది బాధితులు ప్రజాసేన అవినీతి నిరోధక స్వచ్చంధ సంస్థను సంప్రదించారని తెలిపారు. చిట్ ఫండ్ బాధితుల కోసం మా సంస్థ ఈ నెల 19 వ తేదీ మధ్యాహ్నం 1 గంటల నుండి 2 గంటల వరకు హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ రెండవ గేట్ దగ్గర(భీమారం రోడ్) ప్రజాసేన దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. చిట్ ఫండ్ బాధితులు ఎవరైనా సరే 9133179776 నంబర్ లో సంప్రదించవచ్చు అని కోరారు.

Advertisement

Next Story

Most Viewed