రూ. 55 పొదుపుతో నెలకు 3000 పింఛన్.Pradhan Mantri Shram Yogi Maandhan (PM-SYM)

by Anukaran |   ( Updated:2021-07-20 02:51:09.0  )
రూ. 55 పొదుపుతో నెలకు 3000 పింఛన్.Pradhan Mantri Shram Yogi Maandhan (PM-SYM)
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను తీసుకొచ్చింది. ఇందులో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (పీఎం-ఎస్‌వైఎం) కూడా ఒకటి. అసంఘటిత రంగంలోని వారి ఆర్థిక, సామాజిక భద్రత లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్‌ను అందిస్తోంది. ఈ పథకం ద్వారా చాలా లబ్ధి చేకూరుతుంది. రైతులు, మహిళలు, కార్మికులు, రిక్షతొక్కేవారు, బీడీ కార్మీకులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, కొబ్బరి కాయలు అమ్మేవారు ఇలా అసంఘటిత రంగంలోని ఎవరైనా పీఎం ఎస్‌వైఎం పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ పథకం కార్మికులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వారు ప్రతీ నెలా రూ.3000 పొందొచ్చు. అంటే ఏడాదికి రూ.36 వేలు సంపాదించవచ్చు అన్నట్టు.

పీఎం ఎస్ వై ఎం పథకం పెన్ష స్కీమ్ అర్హతలు..

  • కనీసం 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారికి ఈ పథకం వర్తిస్తోంది.
  • పెన్షన్ పథకం రావాలంటే నెలవారీ ఆదాయం 15000లోపు ఉండాలి.
  • ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈఎస్ఐసీ వంటి వాటిల్లో మెంబర్‌గా ఉండకూడదు.
  • అలాగే పన్ను చెల్లించేవారు కూడా ఈ స్కీమ్‌కు అనర్హులు.
  • ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లేదా జన్ ధన్ ఖాతా తప్పని సరి

ఈ పథకం ద్వారా డబ్బులు ఎలా పొదవచ్చు..

ఈ పథకంలో చేరిన వారు 18 ఏళ్ల వయస్సు ఉన్నవారు ప్రతీ నెల రూ. 55 చెల్లించాలి. 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు నెలకు రూ.200 కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వరకు డబ్బులు చెల్లిస్తూ వెళ్లాలి. 60 ఏళ్ల దాటిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి. ఒకవేళ పాలసీదారుడు చనిపోతే వారి భాగస్వామికి 50 శాతం పింఛన్ అందుతుంది. ఇక ఎందుకు లేటు మరీ వెంటే ఈ పథకంలో చేరిపోండి.. ప్రతి నెల 3000 పెన్షన్ అందుకోండి.

డబ్బులు ఎలా కట్టాలి..

పీఎం ఎస్ వైఎం పథకంలో చేరాలి అనుకునేవారు కామన్ సర్వీసెస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ పథకం గురించి ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకుని, ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలతో పథకం కోసం నమోదు చేసుకోవాలి. పథకంలో నమోదు చేసుకున్న అనంతరం మొదటి సబ్‌స్క్రిప్షన్ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలి. తర్వాతి మొత్తం ప్రతి నెలా మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.

Pradhan Mantri Shram Yogi Maandhan (PM-SYM)

Advertisement

Next Story

Most Viewed