- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా టెలివిజన్ కుటుంబానికి నేనున్నా: ప్రదీప్
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై యాంకర్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు…. వెండితెరపై హీరోగా దర్శనం ఇవ్వబోతున్నారు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్న ప్రదీప్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా కల్లోలం కారణంగా కడుపు నిండ తిండికి నోచుకోని సినీ, బుల్లి తెర కార్మికులకు భోజనం పెట్టేందుకు ముందుకొచ్చారు.
Chinna Praytnam 🙏#LetsFightCoronaTogether #StayHomeStaySafe #HelpEachOther pic.twitter.com/rkgDOFlhB6
— Pradeep Machiraju (@impradeepmachi) March 28, 2020
నా టెలివిజన్ ఫ్యామిలీకి నేను అండగా ఉంటానని తెలిపారు ప్రదీప్. తెరపై ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం వచ్చిందంటే.. దాని వెనుక వందల మంది కష్టం ఉంటుందన్నారు. ఆ రోజు షూటింగ్ జరిగితేనే వారికి ఇళ్లు గడుస్తుందన్నారు. లేదంటే తిండి గింజలు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేక పస్తులుండాల్సిందేనన్న ప్రదీప్… కానీ లాక్ డౌన్ కారణంగా కార్మికులకు పని లేకుండా పోయిందన్నారు. అలాంటి కుటుంబాలకు అండగా తన వంతు చిన్న ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. నాకు తెలిసిన 60 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ సమయంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు కదిలి రావాలని పిలుపునిచ్చారు.
Tags : Pradeep Machiraju, Anchor, CoronaVirus, Covid 19