షూటింగ్‌లో హీరో తల, వెన్నెముకకు గాయాలు..

by Jakkula Samataha |   ( Updated:2021-03-19 06:43:40.0  )
షూటింగ్‌లో హీరో తల, వెన్నెముకకు గాయాలు..
X

దిశ, సినిమా : రానా దగ్గుబాటి అప్‌కమింగ్ మూవీ ‘అరణ్య’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు దర్శకుడు ప్రభు సాల్మన్. తెలుగు, తమిళ్ వెర్షన్‌లో విష్ణు విశాల్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి వివరించారు. క్లైమాక్స్ స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో విష్ణు తలకు, వెన్నెముకకు గాయాలయ్యాయని, దీంతో డాక్టర్లు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకోమని సజెస్ట్ చేశారని చెప్పారు. దీంతో సినిమా షూటింగ్‌ కూడా మూడు నెలల పాటు ఆపేయాల్సి వచ్చిందన్నారు.

అంతేకాదు సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం రానా 30 కిలోలు తగ్గాల్సి వచ్చిందని.. ఇందుకోసం ఇంటెన్స్ డైట్‌, వర్కౌట్ చేశాడని వివరించారు. ఇక లీడ్ యాక్టర్స్‌తో ఏనుగులు అలవాటు పడేందుకు 15 రోజుల స్పెషల్ సెషన్ కూడా నిర్వహించామన్నారు ప్రభు. ఇరోస్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ట్రైలింగువల్ ఫిల్మ్ తెలుగులో ‘అరణ్య’గా వస్తుండగా.. హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళ్‌లో ‘కాదన్’ పేరుతో రిలీజ్ కానుంది. కాగా పుల్కిత్ సామ్రాట్, శ్రీయా పిల్గోంకర్, రఘుబాబు ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్న సినిమా మార్చి 26న విడుదల కానుంది.

Advertisement

Next Story