- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్@21కు మెగా కనెక్షన్
ప్రభాస్…. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో తర్వాతి సినిమా సాహోను కూడా పాన్ ఇండియా లెవల్‌లో ప్లాన్ చేసి రిలీజ్ చేశాడు. కానీ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కాస్త డిజాస్టర్ అయిపోయింది. ప్రస్తుతం ఓ డియర్ మూవీ చేస్తున్న ప్రభాస్ …. తన రేంజ్ పడిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే తర్వాతి సినిమాను మహానటి సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకులు నాగ్ అశ్విన్‌తో మూవీ అనౌన్స్ చేశాడు. ఇది ప్రభాస్ 21వ సినిమా కాగా…. టైమ్ మెషిన్స్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందట. సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 కోట్లు అవుతుందని అంచనా. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సినిమాను ప్రకటించినా… నిర్మాత అశ్వినీదత్ ఒక్కరే అంత బడ్జెట్‌లో సినిమా తీయలేరట. అందుకే సాహో సినిమాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట ప్రభాస్ అండ్ టీం. ఇక హిందీ వెర్షన్‌లో కరణ్ జోహార్, టి – సిరీస్, అనిల్ తడాలలో ఎవరినైనా సంయుక్త నిర్మాతలుగా సెట్ చేసే పనిలో ఉన్నారట.
ప్రభాస్ హీరో అంటే ఇన్వెస్ట్ చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తారనేది వాస్తవమే. కానీ సినిమాలో కంటెంట్ ఉండాలని.. మళ్లీ సాహో సినిమా మాదిరి కన్ఫ్యూజ్డ్ స్క్రిప్ట్ ఉంటేనే కాస్త కష్టం. ఇది ప్రభాస్ కెరియర్‌ను కూడా ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.